కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్సేథ్ ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ‘ఐఎన్ఎస్ నిర్దేశక్’ నౌక జాతికి అంకితం కార్యక్రమం మధ్యాహ్నానికి వాయిదా పడింది. వాతావరనం అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. అయితే కేంద్రమంత్రి మధ్యాహ్నం విశాఖకు చేరుకోనున్నారు. అక్కడ నేవల్ డాక్ యార్డులో ‘ఐఎన్ఎస్ నిర్దేశక్’ నౌకను జాతికి అంకితం చేయనున్నారు.