నల్ల ద్రాక్ష తినడం వల్ల పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహ బాధితులు నల్ల ద్రాక్ష తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.