TG: న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నగరంలో పలు నిబంధనలు విధించారు. హోటళ్లు, పబ్బులు, రెస్టారంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రాత్రి ఒంటి గంట వరకూ వేడుకలు నిర్వహించేవారికి అనుమతి తప్పనిసరని.. ఈవెంట్ల నిర్వాహకులు 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో 10 గంటల్లోగా డీజే ఆపేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు.