AP: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా నారా భువనేశ్వరి రూ.76 లక్షల భారీ విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం వడ్డించనున్నారు. కేవలం 5 రూపాయలకే పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తూ లక్షలాది మంది పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లకు ఈ విరాళం ఎంతో అండగా నిలవనుంది.