AP: విజయవాడలో మంత్రి నారాయణతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లను వైసీపీ పాలనలో పట్టించుకోలేదని మంత్రి నిమ్మల మండిపడ్డారు. ఇళ్ల పనులు పూర్తిచేయలేదు కానీ, వాటిని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఘనత జగన్‌దే అని విమర్శించారు. టిడ్కో లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్ళ పనులు వెంటనే పునఃప్రారంభించి నిర్మించాలని మంత్రి నారాయణను కోరినట్లు తెలిపారు.