AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రానికి రానున్నారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో నిర్వహిస్తున్న స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉ. 8:35 గం.లకు ఢిల్లీ నుంచి బయలుదేరి 11:30 గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 12:05గం.లకు ఎయిమ్స్ చేరుకుంటారు. స్నాతకోత్సవాల్లో పాల్గొన్న తరువాత హైదరాబాద్ చేరుకుంటారని అధికారులు తెలిపారు.