TG : ధాన్యం కొనుగోళ్లు, కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వరి కొనుగోళ్లు ఊపందుకోవడంతో పంట సేకరణ, తరలింపు, నిల్వపై చర్చలు జరిపారు.కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట కోతలు, సెంటర్లకు వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.