అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో ఇరు దేశాల సంబంధాలు బలపడ్డాయని ఆయన యంత్రాంగం పేర్కొంది. ఇటీవల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక కూడా అవి కొనసాగుతాయనే విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. యూఎస్‌లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో కలిసి మాట్లాడిన అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్ కాంప్‌బెల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.