AP: రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అంతేకాకుండా, భూసేకరణ, అటవీశాఖ అనుమతులు సహా ఇతర అంశాలపై భేటీలో చర్చలు జరిపారు.