TPT: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన సూత్రధారి మాధవరెడ్డిని సీఐడీ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ ఫామ్ హౌస్లో దాక్కున్న ఆయనను తిరుపతిలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. విచారణ పూర్తి చేసిన అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం రుయాకు తరలించారు. అనంతరం చిత్తూరు కోర్టులో హాజరు పరచనున్నారు.