WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఎస్సీ కాలనీ వద్ద శుక్రవారం జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని డీసీఎం వాహనం ఢీకొట్టడంతో రాడపాక కొమురమ్మకు అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి, 108లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.