AP: సచివాలయంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. కామన్ గుడ్ ఫండ్, ధూపదీప నైవేద్య నిధిపై సమీక్షించారు. చిన్న, మధ్య తరగతి ఆలయాల అభివృద్ధికి సీజీఎఫ్ నిధులు వాడాలని సూచించారు. నిధుల వినియోగంలో పారదర్శకత, సమయపాలన ముఖ్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ఆదేశించారు.