డీఎంకే ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖనిజ వనరుల దోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందని మండిపడింది. ఈ దోపిడిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. వెంటనే నిందితులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని, రూ. కోటి వరకు జరిమానా విధించాలని పేర్కొంది. ఖనిజ వనరులు దేశ సంపద అని, వాటిని దోపిడి చేసేందుకు వీలులేదని చెప్పింది.