అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో 37,916 పోస్టులను భర్తీ చేసినట్లు ఒడిశా సీఎం మోహన్ మాఝి వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో 65 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇలా దశల వారిగా 5 లక్షల మందిని నియమించాలని యోచిస్తునట్లు పేర్కొన్నారు. తాజాగా జలవనరులు, ప్రజా పనులు, పట్టాణభివృద్ధి శాఖలకు సంబంధించి 591 మంది నియామకపత్రాలు అందజేశారు.