TG: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ముర్ము రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు 5 రోజుల పాటు రాష్ట్రంలో బస చేయనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నివాసంలో ఉండారని అధికారులు తెలిపారు. ఇప్పటికే ముర్ము రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాష్ట్రపతి నివాసం ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశామని వెల్లడించారు.