ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకు వెళ్లనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముందుగా జోర్దాన్ వెళ్లి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అనంతరం మోదీ తొలిసారిగా ఇథియోపియాకు వెళ్లి ఆ దేశ ప్రధాని అలీని కలవనున్నారు. అక్కడి నుంచి ఒమన్‌కు వెళ్లి తిరిగి స్వదేశానికి రానున్నారు.