AP: ఎన్టీఆర్ జయంతి తెలుగు ప్రజలకు పండగ రోజు అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ ఎవరెస్ట్ స్టాయికి చేరారని కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారని తెలిపారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా, రైతులకు నేస్తమని చెప్పారు. మహిళలకు అండ, కార్మికులకు అభయమన్నారు.