AP: తుఫాన్ ప్రభావ పరిస్థితి, నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులను పంట నష్టం నివేదికను కోరారు. ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అయితే పంట నష్టంపై ప్రాథమిక అంచనాకు ప్రభుత్వం వచ్చింది. వరి, మొక్కజొన్న, అరటి, ఉద్యానవన పంటలకు నష్టం కలిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు.