AP: కడప టీడీపీ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్య తనయుడు విష్ణు స్వరూప్ ఇవాళ గుండెపోటుతో మరణించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఎమ్మెల్సీ ఇంటికి టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. విష్ణు స్వరూప్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిన్న వయసులోనే స్వరూప్ మరణించడం బాధాకరమని చిరంజీవి అన్నారు. ధైర్యంగా ఉండాలని రామచంద్రయ్యను ఓదార్చారు.