కృష్ణా: గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు నివాసంలో శనివారం చోరీ జరిగింది. ఉంగుటూరు మండలం ఆముదాలపల్లిలో దాసరి ఇంట్లో తలుపులు పగలకొట్టి లోపలకు దుండగులు చొరబడ్డారు. సమీపంలో ఉన్న కొత్త నివాసంలో బాలవర్ధనరావు ఉంటున్నారు. విలువైన వస్తువులు ఏమీ పోలేదని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.