NLR: నందవరం ఆదర్శ పాఠశాలను భారత విదేశీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ బుడుగు శ్రీనివాసులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు విద్యార్థులతో మాట్లాడుతూ.. ఉన్నత స్థాయికి ఎదగడం కోసం సానుకూల దృక్పథంతో కష్టపడి ముందుకు సాగాలన్నారు. జయాపజయాలను సమానంగా తీసుకోవాలని అన్నారు.