KRNL: గోనెగండ్లలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద నేలటూరుకు చెందిన గోరంట్ల మృతిచెందాడు. అతను పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బైక్ టైర్ పగిలిపోయి కింది పడ్డాడు. ఆసపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అతని భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు.