ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పీటర్ ఖలీల్ భారత్‌ను ‘నమ్మకమైన భాగస్వామి’గా అభివర్ణించారు. అలాగే, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాల రక్షణ సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భారత్-ఆస్ట్రేలియా డిఫెన్స్ ఇండస్ట్రీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.