చిన్న పిల్లలకు లిచీ పండ్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ కడుపుతో లేదా దోరగా పండని లిచీలను పిల్లలకు అస్సలు తినిపించకూడదు. వీటిలో ఉండే ‘హైపోగ్లిసిన్ ఎ’ అనే టాక్సిన్ వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయి, పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. బాగా పండిన పండ్లను ఇవ్వాలి. భోజనం చేసిన తర్వాతే తినిపించాలి. గింజలు తీసేసి చిన్న ముక్కలుగా చేసి ఇవ్వాలి.