తమిళనాడులోని రామేశ్వరం- శ్రీలంకలోని తలైమన్నార్ల మధ్య ఫెర్రీ సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు ఈ సర్వీసులు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై ఒప్పందాలు జరుగుతాయన్నారు. తమిళుల ఆకాంక్షలను శ్రీలంక నెరవేరుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు.