AP: CM చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తామే నిర్మిస్తామడం విడ్డూరమన్నారు. స్పిల్ వే గేట్లు తామే పూర్తి చేశామని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తప్పిదాలు జరిగాయని నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. 2027లో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు.. ఇంకా మూడేళ్ల సమయం ఎందుకు? గతంలోనూ 2018కి పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామన్నారని తెలిపారు.