TG: రాష్ట్రంలో 9 మంది అదనపు DCPలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు DCPలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోంశాఖ స్పెషల్ CS రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ DCP (స్పెషల్ బ్రాంచ్) పి.కరుణాకర్‌ను DGP కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో సైబరాబాద్ అదనపు DCP(క్రైమ్స్-I)కు పదోన్నతి కల్పించారు.