ASR: అరకులోయ మండలం సుంకరమెట్ట, బిసుపురం గ్రామాల పరిధిలోని కాఫీ తోటలను జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ సందర్శించారు. ఈ మేరకు కిడారి మాట్లాడుతూ.. రైతులు కాఫీని జీసీసీకి విక్రయించాలని కోరారు. కాఫీకి ఏవరూ ఇవ్వనంత రేటు జీసీసీ ప్రకటించిందని, రైతులకు లోను సౌకర్యం కూడా కల్పిస్తుందని కిడారి పేర్కొన్నారు. రైతులు కాఫీని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.