AP: CM చంద్రబాబుపై YS షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జగన్ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటున్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబు ఏమంటారు? మౌనంగా ఉంటున్నారంటే అదానీ ఒప్పందం అక్రమం కాదని ఒప్పుకుంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం తప్ప.. మీ ఆరోపణల్లో నిజం లేదంటారా? ఇప్పటికైనా డీల్ రద్దు చేసి రూ.1750 కోట్లపై దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అని ‘X’ వేదికగా పేర్కొన్నారు.