‘అమరన్’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తమిళ హీరో శివకార్తికేయన్ ఇదే ఊపులో తన నెక్ట్ చిత్రాన్ని ప్రకటించారు. ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ‘SK 25’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీని ఆకాశ భాస్కరన్ నిర్మిస్తున్నారు. 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రానుందట. అలాగే ఈ చిత్రంలో జయం రవి, అథర్వ కీలక పాత్రలో నటిస్తున్నారట.