బాబి కొల్లి, నందమూరి బాలకృష్ణ కాంబో సినిమాపై హైప్ పెంచుతూ.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఆసక్తికర ట్వీట్ చేశారు. డాకు మహారాజ్ కోసం గాలిస్తున్నామని, అతన్ని పట్టిస్తే రూ.50 లక్షల బహుమతి ఇస్తామంటూ ‘X’లో పోస్ట్ చేశారు. డాకు మహారాజ్ మూవీ, స్క్రీన్ ప్లే మీ ఊహాకు మించి ఉంటుందని రాసుకొచ్చారు. మోక్షజ్ఞ ట్వీట్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.