కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ దేశ ఆర్థికమంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ ప్రకటించారు. ట్రూడో కేబినెట్లో అత్యంత శక్తిమంతురాలిగా ఆమె గుర్తింపు పొందింది. మంత్రి పదవి మారుస్తున్నట్లు ఇటీవల క్రిస్టియాకు ట్రూడో చెప్పారు. దీంతో..రాజీనామానే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్లు క్రిస్టియా వెల్లడించింది. తన రాజీనామా సందర్భంగా ప్రధానికి దేశంలో ప్రజాదరణ తగ్గిందని తెలిపారు.