AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఓ రైతు ఎడ్ల బండిపై 760 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. సత్యసాయి జిల్లా హిందూపురం మండలం శాసనకోటకు చెందిన రైతు నవీన్ రైతుల సమస్యల గురించి వినతి పత్రం అందించేందుకు జనసేన కార్యలయానికి చేరుకున్నాడు. నకిలీ విత్తనాలను కట్టడి చేయాలని, పురుగుల మందులు, యూరియా ఎంఆర్పీ ధరలకే అమ్మేలాగా చేయాలని, పంటకు గిట్టుబాటు ధర ఉండేలే చేయాలంటున్నాడు.