AP: నంద్యాల జిల్లా ఆత్మకూరు-పాములపాడు మండలంలోని బానకచర్ల గ్రామంలో మొసలి కలకలం రేపింది. గ్రామంలోని నిప్పుల వాగుపైన ఉన్న కేసీ కెనాల్లో మొసలి మరోసారి ప్రత్యక్ష్యం అవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత ఐదు రోజులుగా కెనాల్లో సంచరిస్తుండటంతో రైతులకు కునుకు లేకుండా పోయింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మొసలిని దూర ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు.