AP: మాజీ మంత్రి పేర్ని నాని నిన్న మచిలీపట్నంలో ప్రత్యక్షమయ్యారు. రేషన్ బియ్యం అవకతవకలపై నాని భార్య జయసుధపై కేసు నమోదు అయింది. ఈ కేసు నేపథ్యంలో నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఇటీవల వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లోనూ నాని పాల్గొనలేదు. అయితే జయసుధ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.