ఆస్ట్రేలియా, భారత్ మధ్య గబ్బా వేదికగా మూడో టెస్ట్ జరుగుతోంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ వైఫల్యం, రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే విమర్శలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనిపై అనిల్ కుంబ్లే ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ ఫేక్ అని, ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు.