TG: రుణమాఫీ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వట్లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. 50 శాతం మందికి కూడా రుణమాఫీ జరగలేదన్నారు. నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో ఆయన పలు అంశాల గురించి మాట్లాడారు. రుణమాఫీ, 317 జీవో సమస్య, ఎస్సీ ఎస్టీ ఉపాధి అవకాశాల వంటి అంశాలపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు.