TG: ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి మాధవన్ మృతి చెందారు. అతని మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మాధవన్ మరణం మనసును కలిచివేసిందన్నారు. సోనియా గాంధీ కుటుంబం పట్ల ఆయనకున్న నిబద్ధత ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందన్నారు. మాధవన్ కుటుంబానికి మహేష్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు