TG: ఈ రోజు జరిగిన గ్రూప్-2 పరీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు అవాక్కయ్యారు. తెలంగాణ ఉద్యమం పేపర్లో ఉద్యమంలోని కీలక ఘట్టాల నుంచి ప్రశ్నలు వస్తాయనుకున్న అభ్యర్థులకు ఉమ్మడి రాష్ట్రంలోని చంద్రబాబు పాలన గురించి పలు ప్రశ్నలు అడగటంతో విస్తుపోయారు. తెలంగాణ ఉద్యమం పేపరా లేక టీడీపీ పేపరా అని పరీక్ష రాసిన అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.