TG: రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 34 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నెల 28న భూమిలేని వారికి రూ.6 వేల సాయం చేసే తీర్మానానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఈ వారంలోనే ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం.