PDPL: గోదావరిఖని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వ్యవస్థాపకుడు మద్దెల దినేష్ సామాజిక సేవలకు గాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్నారు. బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.