ప్రకాశం: పొదిలి మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి అమ్మడం, ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగలను దొంగలించడం వంటివి చేస్తున్న 8మందిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,80,000 విలువైన సామాగ్రి, 1.2 కేజీల గంజాయి, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంకో ముద్దాయి పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.