EVల ఛార్జింగ్ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్ధమవుతుంది. 2030 నాటికి 30 శాతం విద్యుద్ధీకరణకు రూ.16 వేల కోట్లు అవుతుందని ఫిక్కీ (FICCI) తెలిపింది. అధిక EV డిమాండ్ ఉన్న టాప్ 40 నగరాలకు ప్రాధాన్యత ఇవ్వడం కీలకమని గుర్తించింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా EVల వృద్ధికి తోడ్పడుతున్నాయి. E2W, E3W, బస్సులకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందించే PM E-Drive పథకంతో భారత్ అనేక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది.