KDP: ప్రొద్దుటూరు గోపవరం పంచాయతీ ఉప్పాగులో ప్రజల సౌకర్యార్థం నూతన బస్ షెల్టర్ నిర్మాణానికి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోమవారం భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉప్పాగు గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా బస్ షెల్టర్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, త్వరితగతిన ఈ బస్సు షెల్టర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.