టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఆయన జనసేనలో చేరబోతున్నారంటూ ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా న్యూస్ వైరల్ అయ్యింది. అయితే, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు వచ్చిన మనోజ్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేనని అన్నారు.