TG: గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, AICC రాష్ట్ర ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ నిర్వహించిన సమీక్షా రసాభాసగా ముగిసింది. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలతో మున్సీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. తన కొడుకు అనిల్‌కు రాజ్యసభ ఇచ్చినంత మాత్రాన తమ కుటుంబానికి మరో పదవికి ఇవ్వకూడదా? అని అంజన్‌కుమార్ నిలదీశారు. తనకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.