ADB: నేరడిగొండ మండల కేంద్రంలో హైమాస్ లైట్స్‌ను ఏర్పాటు చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్‌ను స్థానికులు కోరారు. ఈ మేరకు స్పందించిన ఆయన మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి 27 హైమాస్ లైట్లను సోమవారం ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. నాయకులు వసంతరావు, పోతారెడ్డి తదితరులున్నారు.