ప్రతిపక్షాలు నిరాశతోనే ప్రేలాపనలు చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. వారికి ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, ఆర్బీఐ, ఆడిటర్ జనరల్పై నమ్మకం లేదని విమర్శించారు. చివరికి వాళ్లు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కూడా విశ్వసించరని దుయ్యబట్టారు. నాగాపూర్లో సీఎం పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.