AP: పోలవరం పర్యటనలో అతి భద్రతా ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మితిమీరిన భద్రత అవసరం లేదని, ఏలూరు ఎస్పీ, కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రజలకు, కార్యకర్తలకు, మీడియాకు దగ్గరగా ఉంటానని స్పష్టం చేశారు. తన పర్యటనలో ట్రాఫిక్ ఆంక్షల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. తన పర్యటన దృష్ట్యా పాపికొండల బోట్ల నిలిపివేత సరికాదన్నారు.