గత ఐదేళ్లలో అమరావతిలో వైసీపీ విధ్వంసం సృష్టించిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకుని మళ్లీ టెండర్లు పిలిచే స్థాయికి వచ్చినట్లు తెలిపారు. వైసీపీ వల్ల రాజధాని నిర్మాణ పనుల ధరలు 40 శాతం పెరిగినట్లు ఆరోపించారు. బురద చల్లడం తప్ప క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమైనా వైసీపీకి తెలుసా అని ప్రశ్నించారు. 2019లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే అమరావతి నిర్మాణం పూర్తి అయ్యేదని చెప్పారు.